సన్ వ్యాలీ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
భూపాలపల్లి టౌన్ ఆగస్టు 19 (జనంసాక్షి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని
సన్ వ్యాలీ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం పాఠశాల యాజమాన్యం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను మరచిపోకుండా కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. చిన్నారులందరు రాధాకృష్ణ వేషధారణలో కలకలలాడుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.