సమం చేస్తారా..అప్పగిస్తారా

నేడే పాక్‌ భారత్‌ రెండో టీ ట్వంటీ               బౌలింగ్‌లో సీనియర్లు లేని లోటు
గాడినపడని బ్యాటింగ్‌                       అశ్విన్‌ ఆడే అవకాశం
కష్యప్‌కు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌
మూడో స్థానం నిలుపుకున్న సైనా నెహ్వాల్‌
కౌలాలంపూర్‌, డిసెంబర్‌27:వరల్డ్‌ బ్యాడ్మింట న్‌ ర్యాంకింగ్స్‌లో భారత క్రీడాకారులు దూసు కెళుతున్నారు. తెలుగుతేజం పారుపల్లి కష్యప్‌ 14వ ర్యాంక్‌ సాధించాడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ తాజాగా విడుదల చేసిన జాబితాలో కష్యప్‌ ఆరు స్థానాలు మెరుగయ్యాడు. గత వారం భారత్‌లో జరిగిన సయ్యద్‌ మోడీ ఇండి యా గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ గెలవడంతో ఆ ఏపీ ప్లేయర్‌ కెరీర్‌ బెస్ట్‌ర్యాంక్‌ కైవసం చేసుకు న్నాడు. 26 ఏళ్ళ కష్యప్‌ కెరీర్‌లో ఇదే తొలి టైటిల్‌. అటు మలేషియా ఆటగాడు లీచాంగ్‌ వీ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా…తర్వాత వరుసగా నాలుగు స్థానాల్లో చైనా ఆటగాళ్ళే ఉండడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్‌లో హైద రాబాదీ షట్లర్‌ సైనానెహ్వాల్‌ తన మూడో ర్యాం కు నిలుపుకుంది. సయ్యద్‌ మోడీ ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీలో సైనా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టి విమర్శల పాలైన నేపథ్యంలో ఆమె ర్యాంకిం గ్‌ మాత్రం మారలేదు. ఇక ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీలో రన్నరప్‌గా నిలిచిన తెలుగుతేజం పివి సింధు కూడా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. తాజాగా జాబితాలో సింధు ఐదు స్థానాలు మెరుగై  19 ర్యాంకులో నిలిచింది. ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో లిఝురై అగ్రస్థానంలో ఉండగా… వాంగ్‌ రెండోస్థానంలో కొనసాగుతోంది.