సమస్యలకు….ఎస్‌మ్మెస్‌ చేయండి

నిజామాబాద్‌, జనవరి 4 (): పోలీసు స్టేషన్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో నేరుగా తనకు ఎస్సెమ్మెస్‌ చేయాలని ఎస్పీ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఎస్సెమ్మెస్‌ చేయూలని సూచించారు. ఎస్‌ఎంఎస్‌ చేయాల్సిన నెంబర్‌ 89853 33321 అని తెలియజేశారు. జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్‌లో ప్రజల సమస్యలను సంబంధిత స్టేషన్‌ ఇన్‌చార్జిలు పట్టించుకోకపోవడంతో ఎస్పీ నేరుగా వాటిని పరిష్కరించాలని నిర్ణయించారు. ఎస్‌ఎంఎస్‌ చేస్తే సమస్య రికార్డు అవుతుందని, దాని పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ చేసిన వారికి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచుతామని తెలిపారు.