సమస్యలను గ్రామాల్లోనే పరిష్కారిస్తాం
– ఎస్సై ప్రదీప్‌కుమార్
ముత్తారం జూలై 05 (జనంసాక్షి) :
చిన్న చిన్న సమస్యలుంటే గ్రామాల్లోని పరిష్కారిస్తామని ఎస్సై ప్రదీప్‌కుమార్ అన్నారు. గురవారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతు ఏ గ్రామంలోనైన సమస్యలు, ఘర్షణ వాతవరణం నెలకొంటే తమను సంప్రాదించాలని వెంటనే పరిష్కారిస్తామని ప్రజలు వివరించారు. గ్రామంలో ప్రజలందురు కలసి, మెలసి స్నేహభావంతో ఉండాలని సూచించారు. గుడుంబా నివారణకు తమ శాఖ ముందుంటుందని తమకు సహాయ సహకారలు అందించాలని కోరారు. గ్రామ సమస్యలుంటే గ్రామానికి ఒక్కోక్క పోలీస్‌ని నియమించామని సమస్యను వారి దృష్టికి తీసుకవస్తే త్వరగా పరిష్కారించుకోవడానికి వీలుంటుందని అన్నారు. ఆనంతరం గ్రామంలో ఉన్న 3 సమస్యలను ప్రజల సమక్ష్యంలో పరిష్కారించామని అన్నారు.