సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరం
కరీంనగర్ టౌన్, జూలై 7 (జనంసాక్షి) : సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరమని, ముస్లింగా ప్రపంచంలో గొప్ప మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం సర్కస్ గ్రౌండ్‌లో జరిగిన ఆ పార్టీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామాజ్రకాంక్షతో ముస్లిం వర్గాలను లోబార్చుకోని, బలహీన పరిచి తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని అన్నారు. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే ముస్లిం దేశాలను ఒకదాని తర్వాత ఒకదానిని నాశనం చేస్తూ, వాటిని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నాయని అకబరుద్దీన్ మండిపడ్డారు. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో సుమారు 50 వేల మంది ముస్లిం వీరమరణం పొందినా, వారికి చరిత్రలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. మనం దేశంలో అత్యంత బలహీన వర్గాలుగా జీవిస్తున్నది ముస్లింలేనని ఆయన అభిప్రాయపడ్డారు. విరాజ్‌రసుల్ ఖాన్ ఎమ్మెల్యే, హమద్ పాషా ఖాదరీ, అప్సర్ ఖాన్, మేయర్ మాజీత్ హుసేన్, కరీంనగర్ నాయకులు డిప్యూటీ మేయర్ అబ్బస్ సమీ, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు వాహజ్ ఉద్దీన్, గూలామ్ హమ్మద్ హుస్సేన్, సైయాద్ బర్కత్ అలీ, హసఫత్, లింగంపల్లి శ్రీనివాస్, హసఫ్ యూసఫ్, సలీంబాబు తదితరులు పాల్గొన్నారు.