సర్దార్ పాపన్న కు ఘన నివాళులు

మెట్ పల్లి – పెద్దాపూర్ బైక్ ర్యాలీ

మెట్ పల్లి , ఆగష్టు 18 ,(జనం సాక్షి ) సర్దార్ పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గౌడ సంఘం సభ్యులు మెట్పల్లి నుండి పెద్దాపూర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గౌడ జాతి ముందు బిడ్డ సర్దార్ శ సర్వాయి పాపన్న గౌడ్ కు ప్రతి ఒక్కరూ నివాళులర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్య అతిథి శామీర్ పేట ఎంపీపీ దాసరి ఎల్లుబాయి అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రం శామీర్ పేట రాజీవ్ రహదారి వైఎస్ చౌరస్తా వద్ద 372 వ జయంతిని పురస్కరించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దొరల రాజ్యంలో బానిస బతుకులు బతుకుతున్న బడుగు బలహీన వర్గాల కు స్వేచ్ఛ స్వాతంత్రాలను కలిగించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మెరుగు సుదర్శన్ గౌడ్ , మండల ఉపాధ్యక్షులు మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు