సహజసిద్దంగా మామిడి పక్వం 

జగిత్యాల,మే14(జ‌నం సాక్షి): జగిత్యాల మామిడి మార్కెట్‌లో నాగ్‌పూర్‌ మార్కెట్‌ తరహాలో అభివృద్ధి పరచాలని  నిర్ణయించారు. మాగబెట్టేందుకు ఇథలీన్‌ గ్యాస్‌ చాంబర్లు, నిల్వ కోసం శీతల గిడ్డంగులు, క్రయవిక్రయాల కోసం అదనపు షెడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మామిడి వ్యాపారానికి సంబంధించి అపెడాతో ఒప్పందం జరిగింది. జగిత్యాల మామిడి ఎక్కువ తీపి, కాయసైజు పెద్దగా ఉండటం 15 రోజులు నిల్వ ఉన్నా టెంకలో పురుగురాక పోవటంతో మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వ పరంగా విస్తృత ప్రచారం కలిస్తున్నారు. మామిడి దిగుబడి తక్కువగా ఉండటంతో ధర తగ్గినా డిమాండ్‌ మాత్రం పెరుగుతోంది.  మార్క్‌ఫెడ్‌, అపెడా రంగంలోకి దిగితే రైతులకు ఎలాంటి ఇబ్బందులుండవు. వ్యాపారులు ఖచ్చితంగా పోటీ పడి కొనుగోలు చేసే పరిస్థితులుంటాయని అంటున్నారు. వచ్చే సీజన్‌ నాటికి మౌలిక సదుపాయాలన్నీ కల్పించి మామిడి వ్యాపారం పెంచాలని నిర్ణయించారు.