సార్వత్రిక విద్య ఫలితాలపై రీకౌంటింగ్‌కు అవకాశం
శ్రీకాకుళం, జూలై 5 : సార్వత్రిక విద్య ద్వారా ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలపై అసంతృప్తి ఉంటే పరిశీలించుకునేందుకు రీకౌంటింగ్‌కు ప్రభుత్వం అవకావం ఇచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎస్.అరుణకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతికి ఒక పేపర్‌కు 100 రూపాయలు, ఇంటర్మీడియట్‌లో ఒకపేపర్‌కు 200 రూపాయల చొప్పున డైరెక్టర్, ఓపెన్ స్కూల్ పేరు మీద చలానా తీసి నిర్ణీత దరఖాస్తు విధానంలో నేరుగా డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, బషీరాబాద్, హైదరాబాద్ అనే చిరునామాకు ఈ నెల 30లోగా తమ దరఖాస్తును పంపుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల జాబితాలు పది రోజుల్లో సంబంధిత అధ్యయన కేంద్రాలకు పంపుతున్నామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సార్వత్రిక విద్య ద్వారా 8, పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు అపరాద రుసుము లేకుండా ఈ నెల 29వ తేదీవరకు గడువు ఉందని ఆమె వివరించారు.