దాతృత్వంతోనే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం

 

 

 

 

 

ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య

యువతకు క్రీడా పరికరాలు అందజేత

నిజామాబాద్ బ్యూరో చీఫ్ జూన్ 06: జనం సాక్షి‘సొంతలాభం కొంతమానుకొని పొరుగువానికి సాయపడవోయ్‌’ అన్నారు మహాకవి గురజాడ. అదే స్ఫూర్తిని అణువణువునా నింపుకొన్న ఓ మంచి కార్యక్రమం ‘ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌’. ప్రముఖ విద్యావేత్త, మానవతామూర్తి అచ్యుత సమంత.శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ వేడుకలు నిర్వహించడం జరిగింది.గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు,క్రీడ కార్యక్రమాలు, క్రీడా పరికరాలు అందించడం జరిగిందని జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు.
సంస్థ యొక్క ఫౌండర్ అచ్యుత సమంత 13 వ వార్షికోత్సవం సందర్భంగా నాణ్యతతో కూడినటువంటి వాలీబాల్‌ కిట్లు క్రీడాకారులకు అందజేయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.అచ్యుత సమంత నెలకొల్పిన ఈ మహోద్యమానికి నేటికి 13వసంతాలు పూర్తి చేసుకుంది.

వాలీబాల్‌ కిట్ల పంపిణీ

యువతలో మానవీయ విలువలను, సేవా భావాన్ని పెంపొందించడంతో పాటు క్రీడా స్ఫూర్తి ద్వారా నాయకత్వ లక్షణాలు, సమిష్టితత్వాన్ని అలవరచడమే లక్ష్యంగా ఈ ఏడాది ‘షేర్‌ టుషైన్‌’ నినాదం లో భాగంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో
యువతకు,విద్యార్థులకు వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు యువతను సానుకూల దృక్పథం వైపు నడిపించడానికి ఈ కార్యక్రమం తోడ్పడాలన్నది అచ్యుత సమంత ప్రధాన ఉద్దేశం.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం జగన్ మోహన్ , జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వామి కుమార్, జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ ,సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.