పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తలకొండపల్లి న్యూస్ 05 (జనంసాక్షి):రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తమకు బోధించిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.మిత్రుల కష్టసుఖాలను తెలుసుకున్నారు.భవిష్యత్తులో మన పాఠశాలకు,స్నేహితులకు ఎలాంటి అవసరం వచ్చిన అందరం కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో పూర్వపు ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి,పరమేశ్వర్,శ్రీనివాసరావు,సురేష్ రెడ్డి,జానకి రామయ్య,రమేష్,పూర్వ విద్యార్థులు తలకొండపల్లి సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్,చీపునుంతల ఉపసర్పంచ్ రాజు,నరసింహా,మల్లేష్,దశరథం,తదితరులు ఉన్నారు.

తాజావార్తలు