ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి
సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్
మర్రిగూడ, జూన్ 6 (జనం సాక్షి ) : మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ తెలిపారు.ఈ శిబిరంలో నిపుణులైన కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. కంటి శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నవారిని హైదరాబాద్‌కు తరలించి, ఉచితంగా శస్త్రచికిత్స చేయించి తిరిగి స్వగ్రామాలకు చేర్చే ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు.50 సంవత్సరాలు పైబడిన వారు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు మరియు ప్రస్తుతం వాడుతున్న మందులతో ఉదయం 9 గంటలకు శిబిరానికి హాజరుకావాలని కోరారు.మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.



