జీవో 38 అమలు చేయాలి

 

 

 

 

రిటైర్మెంట్ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి: ప్రభుత్వ వైద్యుల సంఘం.

నల్లగొండ ప్రతినిధి,జూన్ 5,(జనం సాక్షి):ప్రభుత్వ వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ప్రభుత్వ వైద్యుల సంఘం (జీఎంసీ నల్గొండ) పిలుపునిచ్చింది. ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రాథమిక సభ్యులందరూ పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సంఘం కోరింది.ప్రస్తుతం బదిలీ ప్రక్రియ జీవో నెం.38 ప్రకారం అమలు కావాల్సి ఉన్నప్పటికీ, కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా అది సక్రమంగా అమలు కావడం లేదని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. జీవో ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేసింది.ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టీఎన్‌జీవో సంఘం సభ్యులు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.అదేవిధంగా ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును పెంచే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. వైద్యుల హక్కులు, సేవా నిబంధనల పరిరక్షణ కోసం అవసరమైతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని సంఘం హెచ్చరించింది.

తాజావార్తలు