సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి బియ్యం ఫర్నిచర్ అందజేత

పినపాక నియోజకవర్గం ఆగష్టు 16 (జనం సాక్షి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పివి కాలనీ చెందిన సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి మంగళవారం రెండు క్వింటాళ్ల బియ్యాన్ని సేవా అధ్యక్షులు జక్కం వాణి రమేష్ చేతుల మీదుగా వృద్ధాశ్రమ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉద్యోగపర్వంలో ఉద్యోగులకు బదిలీలు మజిలీలు సర్వ సాధారణమే కొంతమంది ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు తమ తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా సేవ చేసుకునే భాగ్యం ఉద్యోగరీత్యా దొరకదని లేడీస్ క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించటం దీనికోసం
కొంత సమయం కేటాయించి సేవా చేయటం ఎంతో తృప్తి నిస్తుంది. తమ అమ్మ నాన్నలతో గడిపిన అనుభూతిని పొందామని వృద్ధులు కూడా తమను వారి కుటుంబ సభ్యులుగా భావించి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా క్లబ్ సభ్యుల సహకారంతో మణుగూరు ఏరియాలో ఇటీవల ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఇంకా నిర్వహిస్తామని లేడీస్ క్లబ్ సభ్యులను ప్రోత్సహిస్తున్న వారి కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని కొనియాడారు. మణుగూరు ఓసి మెకానికల్ ఇంజనీర్ ఎస్ ఫల్గుణ చారి నళిని దంపతుల సహకారంతో రెండు మంచాలను వృద్ధాశ్రమానికి అందజేశారు, క్లబ్ కార్యదర్శి అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ సుమారు పాతిక మందికి పైగా వృద్ధులకు సేవలందిస్తున్న వృద్ధాశ్రమం నిర్వాహకురాలు ఎస్.కె షేహనాజ్ ను ఆమె అభినందించారు పండుటాకుల ఆరోగ్యం పట్ల కూడా మరింత జాగరూ కత వహించాలని ఆమె సూచించారు, లేడీస్ క్లబ్ సామాజిక కార్యక్రమాల నిర్వహణలో ప్రోత్సహిస్తున్న ఏరియా జిఎం జక్కం రమేష్ , సేవా అధ్యక్షులు జక్కం వాణి రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సభ్యులు వై. అనిత, భాస్కరి, సల్మా ,స్వర్ణ ,ప్రసన్న, అఫ్రోజ్ ,సరిత, శ్రీలత , నళిని, ఇందిరా, రాజేశ్వరి, భాగ్య ,షబానా,ఫ్యాని , సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షహనాజ్ , రాజేష్,తదితరులు పాల్గొన్నారు.