సిఎం కెసిఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు

రైతులు పెద్ద ఎత్తున వచ్చేలా చర్యలు
ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఈటల
కరీంనగర్‌,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ పథకం దేశంలోనే ప్రథమం కావడంతో పెద్ద ఎత్తున రైతులను సవిూకరించి విజయవంతం చేసేలా చూస్తున్నారు. ఉదయం 11 గంటలకు శాలపల్లి-ఇందిరానగర్‌లోని సభాస్థలికి ముఖ్యమంత్రికి చేరుకుని రైతుబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారని మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు.
మరోవైపు సోమవారం మంత్రి ఈటల రాజేందర్‌ సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీనికితోడు టిఆర్‌ఎస్‌ లక్ష్యం మేరకు కార్యక్రమం విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు అంతా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈనెల 10న నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు ఉమ్మడి జిల్లాలోని రైతులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. కరీంనగర్‌ జిల్లా నుంచే రైతుబందు కార్యక్రమాన్ని కెసిఆర్‌  ప్రారంభిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు తోడు అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  ఇక్కడ ధర్మరాజుపల్లి రైతులకు ముఖ్యమంత్రి చేతుల విూదుగా చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి సభకు లక్ష మంది రైతులు తరలివస్తున్నారని, వీరందరికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైతులు తమ వాహనాల్లోనే తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు తెచ్చుకోవాలని, ముఖ్యమంత్రి సభ ముగిసిన తర్వాత రైతులంతా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ధర్మరాజుపల్లి వెళ్లి రైతులతో పలు విషయాలు చర్చించారు. గ్రామంలో 274 మంది రైతులకు రైతుబంధు చెక్కులు వచ్చాయని, ఈనెల 10న ముఖ్యమంత్రి చేతుల విూదుగా 10 మంది రైతులకు చెక్కులు అందచేస్తారని వివరించారు.
——–