సిద్ధి వెంకటేశ్వర్ల మరణం సిపిఐ కి తీరని లోటు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 21(జనం సాక్షి)
కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు గారి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి
సోమవారం వరంగల్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయం తమ్మెర భవన్లో కామ్రేడ్ సిద్ది గారి సంతాప సభకు గన్నారమేష్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి మేకల రవి గారు హాజరై కామ్రేడ్ సిద్ది గారు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా వరంగల్ ఉమ్మడి జిల్లా నిర్మాణ బాధ్యతలు తో పనిచేసి ప్రతి సమస్యపై తనదైన శైలిలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన మహానీయుడు కామెంట్ సిద్ది గారు చిన్ననాటి నుండే విద్యార్థి ఉద్యమంలో అనేక రకాల ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేసి ఖమ్మం జిల్లా మొదలు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ప్రతి ఉద్యమంలో ముందుండి నడిపిన మహానేత కాంగ్రెస్ సిద్ది గారు ఈయన మరణం పార్టీకి తీరని లోటు ఈ ఆశయం కోసమైతే పోరాడినారో ఆ ఆశయం కోసం నెరవేరుస్తామని వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి గారు అన్నారు సిద్ది గారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం సంతాప సభ జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె బా షూమియా గారు జిల్లా కార్యవర్గ సభ్యులు బుస రవీందర్ గారు గుండె బద్రి గారు జాన్ పాల్ గారు కండేనర్సయ్య తదితరులు పాల్గొన్నారు