సిపిఎం సీనియర్ నాయకులు మృతి…
అనంతగిరి జనంసాక్షి:
షేక్ సైదులు మృతి సిపిఎం పార్టీకి తీరనిలోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు అన్నారు.మండలం పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదులు శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆయన యొక్క భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ మండలంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేయడంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి షేక్ సైదులు అని వారన్నారు. మండలంలో వ్యవసాయ కార్మికులు కూలి రేట్లు పెంచాలని, కనీస వేతనం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వ్యవసాయ కార్మికులను కదిలించడంలో ముఖ్యపాత్ర పోషించారని ఆన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారని, ఆయన చనిపోవడం సిపిఎం పార్టీకి తీరని లోటు అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ఆయన తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరావు, మిట్టగనపుల ముత్యాలు, మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ ,గ్రామ కార్యదర్శి సాదే కోటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు జుట్టుకొండ వీరయ్య, వార్డు మెంబర్ గోపతి విజయ్, గోపతి బిక్షమయ్య, గోపతి గోపయ్య, శ్రీనివాస్ వెంపటి ,శ్రీనివాస్, కే వెంకటేశ్వర్లు, కే చిన్న వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.