సిపిఐ బహిరంగ సభకు తరలిన కార్యకర్తలు,నాయకులు.
ఈనెల 4 నుండి 7 వరకు సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలు శంషాబాద్ పట్టణంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా మొదటిరోజు ఆదివారం జరిగే భారీ బహిరంగ సభకు నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధి ఎండబెట్ల, గుడిపల్లి, వెంకటాపురం,ఉయ్యాలవాడ గ్రామాల నుండి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు వాహనాల ద్వారా తరలి వెళ్లారు.ఈ సందర్భంగా కొమ్ము భరత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, మంచి నూనె, నిత్యవసరసరుకుల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నాయి.మతాన్ని అడ్డం పెట్టుకుని బిజెపి పబ్బం గడుపుకుంటూ ఎన్నికల వాగ్దానాలను ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తుంది.నల్లధనం వెలికితీత వట్టి మాటగా మిగిలిపోయిందని అన్నారు. ఎనిమిదేళ్ల పాలన కాలంలో అచ్చేదిన్ నినాదం ఏమో కానీ ప్రజలకు సచ్చే రోజులు వచ్చాయి అన్నారు.ప్రభుత్వ విధానాలపై నిరసనగలం విప్పిన మేధావులు విద్యార్థులు విపక్ష నేతలపై రాజ పై ద్రోహం కేసులు పెట్టి నిర్బంధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం చెందిందన్నారు.డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ, దళిత గిరిజనుల కు మూడెకరాల భూ పంపిణీ, రైతు రుణమాఫీ, దలిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి తదితర వాగ్దానాలు ఏవి అమలు పరచకపోగా బస్ చార్జీలు, బస్ పాస్ చార్జీలు, కరెంట్ చార్జీలు, మద్యం ధరలు భారీగా పెంచి ప్రజలను వంచించింది అన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకవిధానాలపై , గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ నిర్వహించిన పోరాటాలు సాధించిన విజయాలు సమీక్షించి పోరాట కార్యక్రమాన్ని ఈ మహాసభలలో రూపొందిస్తామని ఆయన తెలిపారు.ఈరోజు జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని తరలిస్తున్నామని ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎంపీ బినయ్ విశ్వం, జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మంచల బొందయ్య, బాలస్వామి, రాము, జంగయ్య, నాగన్న, చిన్న, నరేందర్, శంకరయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.