సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్‌

సిరిసిల్ల: వైఎస్‌ విజమయ్మ పర్యటనకు నిరసనగా సిరిసిల్లలో తెరాస ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో వాణిజ్యసంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు పట్టణంలోని తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో అనేకమంది తెరాస నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.