సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు
నిజామాబాద్,డిసెంబర్10(జనంసాక్షి): మార్కెట్లో పత్తి క్రయ విక్రయాలను పరిశీలించి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రైతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర జిల్లాల పత్తిని కొనుగోలు చేయవద్దని నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల సీసీఐ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జి జేడీ ఇఫ్తార్‌ఖాన్ అన్నారు. మార్కెట్లోకి పత్తి ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి పత్తి వస్తే కొనుగోలు చేయవద్దని సీసీఐ ఇన్‌చార్జికి సూచించారు. రైతులు మోసపోకుండా కొనుగోళ్ల పక్రియ జరపాలని మార్కెట్ కమిటీ సిబ్బందికి సూచించారు.