సిసి కెమెరాలతో భద్రత
సత్ఫలితాలు ఇస్తోన్న ప్రయోగం:పోలీసు కమిషనర్
కరీంనగర్,మే12(జనం సాక్షి): నేరాల అదుపునకు హైదరాబాద్ తరహాలో కృషి చేస్తున్నామని పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి అన్నారు. ఇందులో సిసి కెమెరాలకుప ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఒక సీసీ కెమెరా సుమారు 30 మంది కానిస్టేబుళ్లతో సమానమన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సుమారు 20 వేల కెమెరాలను ఏర్పాటు చేసుకోవటం జరిగిందని తెలిపారు. మన జిల్లాలో చిన్న చిన్న గ్రామాలతో పాటు, పట్టణ కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేసుకొని ముందంజలో ఉన్నారన్నారు. వీటి ఏర్పాటుకు వ్యాపారులు, కోలాట కళాకారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చినట్లు చెప్పారు.
సీసీ కెమెరాలతో భద్రత ఉంటుందని, ప్రతి పట్టణం స్మార్ట్ అండ్ సేవ్ నగరంగా తయారు కావాలని కమలాసన్‌రెడ్డి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కమిటీలు ఏర్పడి కమ్యూనిటీ కెమెరాల ఏర్పాటుపై
చైతన్యం రావాలన్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతో/-సహిస్తున్నామని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు పాల్పడే వారిని అవలీలగా గుర్తించవచ్చన్నారు. ఏదైనా సంఘటన జరిగినా కూడ ఆ సంఘటన చిత్రాలను చిత్రీకరిస్తుందన్నారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుతుందన్నారు. రోజురోజుకు నేరాలు కొత్త తరహాలో జరుగుతున్నాయన్నారు. వీటి ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చన్నారు. ఆయా పట్టణాల్లో పలువురు వ్యాపారులు కెమెరాలను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు.