సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట
కరీంనగర్,డిసెంబరు 6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళే శ్వరం ఎత్తిపొతల పధకం ప్రాజెక్టు పనులను పరిశీల నలో భాగంగా బుధవారం సాయంత్రం 5-15 గంట లకు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిపాడ్లో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ ” రావు చేరుకున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖామాత్యులు ఈటెల రాజేందర్, భారీ నీటిపారుడు శాఖామాత్యులు హరీష్ రావు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బి.వి నోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మికాంతరావు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమా, ప్రభుత్వ విప్ కొప్పల ఈశ్వర్, ఐ.డి.సి. ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మైనార్ట్సీ కార్పొరే షన్ చైర్మన్ అక్బర్ హుస్సెన్, సాంస్కృతిక మండలి చైర్మన్, రసమయి బాలకిషన్ శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణ రావు, భానుప్రసాద్, శాసనసభ్యులు, గంగుల కమలాకర్ , సతీష్ బాబు, దాసరి మనోహర్ రెడ్డి, నగర మేయర్ రవీందర్ సింగ్,జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్ ముఖ్యమంత్రికి హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం ఫలికారు. కాలినడకనే హెలిపాడ్ ప్రాంతం నుంచి స్థానిక నాయకులతో కలిసి తన నివాసంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, తెరాస కార్యదర్శి సంతోష్‌రావు హెలికాప్టర్‌లో వచ్చారు.అనంతరం ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు , కార్పొరేటర్లు జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు, జిల్లా అదికారులతో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో జరుగుచున్న అభివృద్ధి పనుల పై తెలుసుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపొతల పధకం పనుల పురోగతి పర్యటన గురించి సమావేశంలో చర్చించారు. అనంతరం రాత్రిబస ఉత్తర తెలంగాణాభవన్లో చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9.00 గంటలకుకరీంనగర్ నుండి బయలు దేరి కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పనుల సందర్శనల భాగంగా తుపాకుల గూడెం మేడిగడ్డ ! అన్నారం సుందిళ్ల బ్యారేజి నిర్మాణాల పనులను, కన్నెపల్లి సిరిపురం పంప్ హౌజ్ నిర్మాణాల పనులను పరిశీలిస్తారు. అదే రోజు రామగుండంలో రాత్రి బస చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం 12 గంటలకు రామడుగు మండలం లక్ష్మీపూర్ లో కాళేశ్వరం ఎత్తిపొతలపధకంలో భాగంగా సొరంగ నిర్మాణాలు, పవర్ హౌజ్, గ్రావేట్ కాలువ నిర్మాణాల పనులను తనిఖీ చేయనున్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు ఇరిగేషన్ అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం జగిత్యాల జిల్లాలో,కాళేశ్వరం ఎత్తిపొతలపధకంలో భాగంగా సొరంగ నిర్మాణాలు, పవర్ హౌజ్, పనులను పరిశీలిస్తారు. అలాగే మిడ్ మానేరు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.