సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షి గా తెలిపిన హామీలను నెరవేర్చకపోవడం శోచనీయం
వీఆర్ఏల జేఏసీ జిల్లా అధ్యక్షులు బెజ్జం భరత్ కుమార్
కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఎ లు స్థానిక తహసిల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహిస్తున్న నిరువదిక సమ్మె 15వ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా కేసముద్రం మండల కేంద్రంలో సోమవారము సమ్మెలో పాల్గొన్న జిల్లా వీఆర్ఏ ల జేఏసీ అధ్యక్షులు బెజ్జం భరత్ కుమార్ మాట్లాడుతూ…వీఆర్ఏలు సమ్మె మొదలుపెట్టి 15 రోజులు గడుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్,అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండడం సబబు కాదని,కనీసం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు.ఈ సమ్మెను రానున్న కాలంలో ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని హామీలను నెరవేర్చి వీఆర్ఏల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆవేదన వ్యక్తం చేశారు.