సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.
కౌడిపల్లి (జనంసాక్షి).మండల పరిధిలోని కుషన్ గడ్డ గ్రామపంచాయతీకి చెందిన పాలిత్య మోతి భర్త కస్యకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 60 వేల రూపాయల చెక్కును బుధవారం రోజున అందజేయడం జరిగిందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామ గౌడ్ తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన చెక్కును గ్రామపంచాయతీ వద్ద ఇవ్వడం జరిగిందని రామ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కుషన్ గడ్డ సర్పంచ్ లావణ్య మోహన్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ధరావత్ రాజు,ఉప సర్పంచ్ చౌహన్ సింగ్,నాయకులు రవీందర్ నాయక్, ఫైజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.