సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ర్యాలీ
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 11
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అందరికీ స్వాతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు వజ్రోత్సవ వారోత్సవాల్లో భాగంగా అల్వాల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్వాల్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి, ఈఈ రాజు, ఏఎంసి హేమలత, డిఈ మహేష్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెంబర్ రాజసింహారెడ్డి, పెద్ది రమేష్, సుందరేశ్వరరావు, బి నాగేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, శివశంకర్, గోపాల్, వెంకట్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
