సీపీఐ నాయకులు అరెస్టు, విడుదల

హుస్నాబాద్‌ జూన్‌ 26(జనంసాక్షి) మద్యం షాపుల డ్రా పద్ధని అడ్డుకుంటామని ప్రకటించి నందుకు భారత కమ్యూనిస్తు పార్టీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. ప్రభుత్వం  ప్రజల మరింత భారాన్ని మోపేందకు తమ ఖజానా నింపుకునేందకు డ్రా పద్దతిని ప్రవేశ పెట్టేండుకు దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని అరెస్టు అయిన నాయకులు పట్టణ కార్యదర్శి అయిలేని మల్లికార్జున్‌ రెడ్డి, ఎంఎస్‌ అలీ, పెండ్యాల అయిలయ్య, రోళ్ల భాగ్య, అక్బర్‌, సారయ్యలు అన్నారు. కాగా అరెస్టు అయిన నాయకులను సొంత పూచీ కత్తుపై సాయంత్రం విడుదల చేశారు.
చిగురుమామిడిలో……
మాజీ జడ్పీటీసీ అందెస్వామి, ముద్ర కోళ రాజయ్య, మామిడి అంజయ్య, వేముల వెంకట్రాజం, నాగలి లక్ష్మారెడ్డి, తాళ్లపల్లి చిన్న చంద్రయ్య, శ్రీమూర్తి సాయిరెడ్డ్ణి, పెద్దపల్లి రవీందర్‌ తదితరులను అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు.
కోహెడలో …..
మండల కార్యదర్శి వేల్పుల బాలమల్లు , నలువాల ప్రతాప్‌రెడ్డి, వెళ్ది ఆనందరావులను అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు.