సీమాంధ్ర తొత్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలి

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సీమాంద్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తెలంగాణ అవకాశవాద నాయకులకు ప్రజలే బుద్ది చెప్పాలని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ విమలక్క డిమాండ్‌ చేశారు. సోమవారం వైఎస్‌. విజయమ్మ చేపట్టిన చేనేత దీక్షను నిరసిస్తూ ఆమె కళాబృందంతో నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణపై తమ వైఖరి చెప్పకుండా నేత కార్మికులపై మొసలి కన్నీరు కార్చుతే చూస్తూ ఊరుకోబోమన్నారు. పోలీసులు సీమాంధ్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సభా ప్రాంగణానికి వస్తున్నవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ పోరాటం ఇక్కడి ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. అక్రమ అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పించేవరకు సిరిసిల్ల నుంచి ఆమెను కదలనీయవద్దని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో వెంకటస్వామి, గొట్టె రుక్మిణి, లక్ష్మి, రాధ, తదితరులు పాల్గొన్నారు.