సీమాంధ్ర నేతలకు తలొగ్గే షిండే వ్యాఖ్యలు : ఛైర్మన్ కోదండరాం
మహబూబ్‌నగర్ : తెలంగాణ ఇస్తే దేశంలో ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్నది ఒట్టిమాటేనని రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం అన్నారు. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్ చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీమాంధ్ర నేతలకు తలొగ్గే హోంమంత్రి షిండే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.