సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో అన్యాయం
భవిష్యత్తు కోసం దిద్దుబాటు
సీఎం కేసీఆర్
హైదరాబాద్,సెప్టెంబర్3(జనంసాక్షి):
తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్‌కు పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సాగునీటి విషయంలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం తెలంగాణకు 1,280 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించామని ప్రాజెక్టుల వారీగా లెక్కలు చెప్పారని తెలిపారు. అయితే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ దగా పడిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం చంద్రశేఖర్‌రావు సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణులు విద్యాసాగర్‌రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మనకు ఏది కేటాయిస్తే అది చాలంటున్నాం. అయినా ఏపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అంతరాష్ట్ర వివాదాలకు తావు లేకుండా తెలంగాణకు చెందిన ఒక్క ప్రాజెక్టు కూడా డిజైన్ చేయలేదన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో కోతలు లేని కరెంట్ అందించగలుగుతున్నామన్నారు. 2018 నాటికి మిగులు విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నల్లాల ద్వార నీరు అందించేందుకు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును రూపొందించామని పేర్కొన్నారు. హడ్కో, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తుంది. ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్ర బడ్జెట్ రూ. లక్షా 58 వేల కోట్లకు పెరగనుందని చెప్పారు. మనది ఏ వన్ రాష్ట్రం అని సర్వే సంస్థలు తేల్చాయి. ఉన్నతంలో వ్యూహం వేసుకుని తెలంగాణ ముందుకు పోతుందని పేర్కొన్నారు.
మాజీ సైనికుల సేవలు వినియోగించుకుంటాం
మాజీ సైనికుల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వారంతా బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారికి ఇస్తున్న గౌరవ భృతిని రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచుతామన్నారు. ప్రతిభగల సైనికాధికారులను రాష్ట్ర అవతరణ వేడుకల్లో సత్కరిస్తామని ప్రకటించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మాజీ సైనికులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు.
మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ వరాలు
బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికుల భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో వారి సహకారం తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ లో గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు భాగస్వాములైనందుకు ప్రజల్లోకి మంచి సందేశం వెళ్లిందన్నారు. దాదాపు వంద మంది మాజీ సైనికోద్యోగులు, కొందరు మాజీ పోలీసు అధికారులు సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ బేగంపేటలోని అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత మాజీ సైనికులనుద్దేశించి ప్రసంగించారు.
మాజీ సైనికోద్యోగుల సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ఇస్తున్న గౌరవ భృతిని రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ సైనిక అధికారులను వచ్చే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఘనంగా సన్మానిస్తామన్నారు. జిల్లాల వారీగా మాజీ సైనికుల సమస్యలను క్రోడీకరించి తనకు అందజేయాలని కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి, మాజీ సైనికులకు మధ్య వారధిగా పనిచేసేలా ఆరుగురి పేర్లు ఎంపిక చేసి ఇవ్వాలన్నారు. ఇండ్లు లేని వారికి బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం కింద కొంత శాతం ఇండ్లను రిజర్వ్ చేస్తామని తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్ లో నిధులు కూడా కేటాయిస్తామని హావిూ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీ, ¬ం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, తాను కలిసి మాజీ సైనికుల సంక్షేమం కోసం ఒక వ్యూహం రూపొందిస్తామని సీఎం చెప్పారు.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితులు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మాజీ సైనికులకు వివరించారు. గత పాలకులు తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి చేసిందేవిూ లేదన్నారు. హైదరాబాద్ లో సమావేశాలకు జూబ్లీ హాల్ తప్ప ఇంకో భవనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కూడా సరైన సౌకర్యాలు లేవన్నారు. డీజీపీ, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఉండటానికి నివాస సముదాయం లేదని గుర్తు చేశారు. 40 వేల మంది దాకా ఉన్న మాజీ సైనికోద్యోగులు ఏదైనా కార్యక్రమం పెట్టుకుందామంటే సరైన భవనం లేదన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. తమ అంతటి మేధావులు లేరని గత పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు 1280 టీఎంసిల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించినట్టు ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అసెంబ్లీకి సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. అంటే ఆ 1280 టీఎంసీలు తెలంగాణ హక్కు అని తేల్చి చెప్పారు. తెలంగాణలోని కోటి రెండు లక్షల ఎకరాల సాగు భూమికి వెయ్యి టీఎంసీలు, ఇతర అవసరాలకు మరో 200 టీఎంసీలు సరిపోతాయన్నారు. మనది మనకు ఇవ్వమంటే ఏపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తున్నదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో వివాదం లేకుండా ఒక్క ప్రాజెక్టూ డిజైన్ చేయలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకూడదనే వారి ఆలోచన అన్నారు. ఉదాహరణకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తీసుకుంటే తమ్మిడి హెట్టి నుంచి చేవెళ్లకు నీరు ఎలా వస్తుందో అర్థం కాదు. వారు రూపొందించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమన్నారు. అందుకే నీటి పారుదల ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
సమాజంలో ఎక్కువ పాత్ర పోషించేది విద్యుత్ వ్యవస్థ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం కోతలు లేని కరెంట్ ను ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో 2018 నాటికి మిగులు విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందన్నారు. కొత్త పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరు అందించడానికి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును రూపొందించి అమలు పరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనికి హడ్కో, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని వెల్లడించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తున్నదని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 95 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. మన గ్రోత్ రేట్ చాలా బాగుందని, మున్ముందు రాష్ట్ర బడ్జెట్ లక్షా 58 వేల కోట్లకు పెరగనుందని వెల్లడించారు. తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమని సర్వేలు చాటుతున్నాయని అన్నారు.
సీఎం కేసీఆర్ సందేశాన్ని ఆసాంతం శ్రద్ధగా విన్న మాజీ సైనికులు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుతామని చెప్పారు. అంతకుముందు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ సమస్యలపై సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాజీ సైనికులతో కలిసి భోజనం చేసి వారిని గౌరవించలేదని కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ డీజే రావు రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇవాళ తెలంగాణ వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది అన్నారు సీఎం కేసీఆర్.
ఈ సమావేశంలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీజీపీ అనురాగ్ శర్మ, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేష్ కుమార్, సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.సురేష్ రెడ్డి, రిటైర్డు ఐజీలు వి.భాస్కర్ రెడ్డి, సి.రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.