సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయండి
– దక్షిణాది బార్కౌన్సిల్ డిమాండ్
హైదరాబాద్,జనవరి 24(జనంసాక్షి):దక్షిణ భారత దేశంలో సుప్రీంకోర్టు బెం చ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగా ణ బార్ కౌన్సిల్ సభ్యులు బి. కొండా రెడ్డి ఆధ్వర్యం లో ఆన్లైన్ జూమ్ వెబి నార్ ద్వారా సెమినార్ నిర్వహించారు ఈ వెబినార్ లో ముఖ్య వక్తలుగా తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ. నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ జీ. రామా రావు, కేరళ బార్ కౌన్సిల్ ఛైర్మన్ కె. పి. జయ చంద్రన్, తమిళనాడు బార్ కౌన్సిల్ చైర్మన్ పి. అమల్ రాజ్ పాల్గొని ప్రసంగిం చారు . ఈ సందర్భంగా వక్తలు సంయుక్తంగా మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలనే చట్టబద్ధమైన డిమాండ్ పూర్వందేనని, ఈ అంశం దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నదని వారు స్పష్టం చేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం న్యాయ సమ్మతి నిర్ణయాలను ప్రాథ మిక హక్కులను కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని వారు అన్నారు. వాస్తవంగా సుప్రీంకోర్టు దూరం కారణంగా అప్పీల్ రేటు దక్షిణ రాష్ట్రాల నుండి 3.1శాతం మాత్రమే ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయని వారు అన్నారు. అదే విధంగా సుప్రీంకోర్టు సుదూరంగా వేల కిలోవిూటర్ల మేర ఉండటం, ప్రయాణ సమయం, ఖర్చు, వసతి సమస్య వంటి సమస్యలు నిత్యం న్యాయ వాదులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మరియు అధికార పరిధిలో బెంచ్ నిర్ణయం ఆవశ్యమని, ఈ నిర్ణయం రాజ్యాంగం లోని ఆర్టికల్ 130 ప్రకారం సీజెఐ, రాష్ట్రపతి ఆమోదంతో నిర్ణయం తీసుకోవచ్చన్నారు.10 వ లా కమిషన్ నివేదికలో జస్టిస్ కె కె ఎజీబిష్ట్రవలి, 11 వ కమిషన్ నివేదికలో జస్టిస్ దేశాయ్,18వ కమిషన్ నివేదికలో ఏ. ఆర్. లక్ష్మణన్ న్యాయమూర్తులు నేతృత్వంలోని బృందం బెంచ్ ను ఏర్పాటు చేయాలని నివేదించారని వారు స్పష్టంచేశారు. అదే విధంగా పార్లమెంటరీ స్థాయి సంఘం తన 2,6,15,20,26,28 నివేధికలలో దేశంలోని దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయని వారు ఉద్ఘాటించారు. కాబట్టి వెంటనే ఈ బెంచ్ ఆవశ్యకత ను లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సత్వరమే దక్షిణాది ప్రాంతంలో బెంచ్ ను ఏర్పాటు చేయాలని అన్ని దక్షిణ రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఛైర్మన్లు రెసొల్యూషన్ ను ఆమోదింపజేసి, భవిష్యత్ కార్యాచరణ ను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.ఈ సెమినార్ లో దక్షిణ భారతదేశ సుప్రీంకోర్టు బెంచ్ సాధన సమితి కన్వీనర్ గా ఏ. నర్సింహా రెడ్డి ను(తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్) , దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఛైర్మన్లు ఎన్నుకున్నారు.