సేవకు ప్రతిరూపం మదర్ థెరిస్సా.

– తొర్రూరు తహశీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి.
తొర్రూరు 26 ఆగస్టు( జనంసాక్షి )
నోబుల్ శాంతి పురస్కర గ్రహీత,సేవాకు ప్రతిరూపం విశ్వమాత మదర్ థెరిస్సాను   మరవకూడదని,తొర్రూరు తహసిల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు.మదర్ థెరిస్సా 112వ జయంతిని పురస్కరించుకొని,శుక్రవారం పట్టణ కేంద్రంలోని “అనాధ మదర్సా ఇస్లామియా మదిన తుల్ ఊలుమ్” పాఠశాలలో అనాధ పిల్లలకు స్థానిక తహసిల్దార్ రాఘవరెడ్డి ఫ్రూట్స్,బ్రెడ్స్,నోట్ పుస్తకాలు మరియు పెన్స్,పెన్సిల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రాఘవరెడ్డి మాట్లాడుతూ..పేదలు జీవించే ప్రాంతాలకు వెళ్లి,వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించి,ఎప్పటికప్పుడు సేవలు అందించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకోని దేశానికే మదర్ థెరిస్సా తల్లిగా మారిందని కొనియాడారు.మదర్ థెరిస్సా చేసిన సేవా ఫలితాలు నేటికీ దేశంలో నిలిచిపోయాయని,ఆమె చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని,ఆమె నడిచిన అడుగుజాడల్లో నడవాలని కోరారు.విద్యార్థులు కష్టపడి చదివి,ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ జలీల్ మరియు ముస్లిం మత పెద్దలు మొహమ్మద్ అమీర్,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్.జఫిరొద్ధీన్ మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.