సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
హైదరాబాద్ : మహిళల రక్షణ, చోరీల నివారణ, ట్రాఫిక్ నియంత్రణే తన ప్రాధాన్యాలని సైబరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ అన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ పదవి నుంచి సైబరాబాద్ కమిషనర్‌గా వచ్చిన అనంద్ ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. అధికార లాంఛనాలు పూర్తి చేశాక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో పలు సమస్యలపై కొత్త విధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాల్ని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తామని అనంద్ వెల్లడించారు.