సోషల్‌ మీడియా అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు

భూమిపై సరిహద్దులు నిర్వచించని కొత్తదేశం ఏర్పడింది. ఇది పదేళ్లలోపు వయసు కలిగి, భూగోళమంతా విస్తరించింది. ఇక్కడ 2012 నాటికి వంద కోట్ల జనాభా ఉన్నారు. ఇది భూమిపై చైనా, భారత్‌ తర్వాత అత్యధిక జనాభా కలిగిన మూడో దేశం. ఆధునిక మానవులకు ఈ సంఖ్యను చేరుకునేందుకు రెండు లక్షల సంవత్స రాలు పట్టిందని అంచనా. ఈ దేశం కేవలం సైబర్‌ స్పేస్‌లోనే ఉంది. దానినే ఫేస్‌బుక్‌ అంటారు. ఫేస్‌బుక్‌ అంటే డిజిటల్‌ ఆర్ట్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, బిజినెస్‌లన్నీ సృజనాత్మక రీతిలో ఒకచోట చేరి మానవ భావవ్యక్తీకరణ, సమాచార మార్పిడి, సామాజిక చర్యలు, విద్య వంటి అంశాలకు ఉపయోగపడేది డిజిటల్‌ మీడియా. ఇది ప్రపంచమంతా అనుసరించే అద్భుత ప్రక్రియ, మానవుల పరస్పర స్పందనలకు కొత్త రూపాలను ఇచ్చేందుకు ప్రేరేపిస్తున్న వేదిక ఈ ప్రక్రియనే సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌గా వ్యవహరిస్తున్నారు.
విశేషరీతిలో అభివృద్ధి చెందుతున్న సామాజిక మాధ్య మం (సోషల్‌ మీడియా) రంగం నుంచి భారత్‌ అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇప్పటికీ దేశ జనాభాలో, పెద్ద సంఖ్యలో ప్రజలకు ఇంటర్నెట్‌ అందుబాటులో లేనప్పటికీ ఇది సాధ్యమే. అయితే దీంతో నష్టం కూడా ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ప్రకా ర్లు, తప్పుడు సమాచారం, అసంతృప్తిని వ్యాప్తి చేసి దురుపయోగం చేసే వీలుంది. ఒకవైపు సాధికారిత ప్రజాస్వామ్య శక్తిగా ఉపయోగ పడటంతో పాటు అయోమయం, గందరగోళం, అరాచకాల వ్యాప్తికి సోషల్‌ మీడియా అవకాశం కల్పిస్తుంది. ఇతర అభివృద్ధి చెందు తున్న దేశాల మాదిరిగానే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఇంట ర్నెట్‌ వినియోగంలో అంతరాలను పూడ్చడంతో పాటు సోషల్‌ మీడియాలోని సానుకూల, వ్యతిరేక అంశాలు, ప్రయోజనాలు, సవా ళ్ల మధ్య సమతూకం తీసుకురావాల్సిన అవసరం ఉంది.సోషల్‌ మీడియా అంటూ ‘ఇంటర్నెట్‌ వినియోగదారుడు ఏదైనా సమా చారాన్ని లేదా భావనను సృష్టించడం, మార్పిడి చేసుకోవడం వంటి అవకాశాన్ని కల్పించే ఇంటర్నెట్‌ ఆధారిత అప్లికేషన్ల సమూహం అని నిర్వచించారు. ఇంకా సోషల్‌ మీడియా అనేది మొబైల్‌, వెబ్‌ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించుకొని వ్యక్తులు, సమూహాలు (కమ్యూనిటీలు), అత్యున్నత చర్చా వేదికలను సృష్టించుకోవడం తద్వారా సమాచారాన్ని పంచుకోవడం, మరింత మెరుగుపరచడం వంటివి చేయవచ్చు.సోషల్‌ నెట్‌వర్కింగ్‌, సోషల్‌ మీడియా వృద్ధికి దోహదం చేసిన ప్రముఖ సాధానాలలో మొబైల్‌ ఫోన్‌ ఒకటి. ఏసీ నీల్సన్‌ విడుదల చేసిన ‘ది సోషల్‌ మీడియా రిపోర్ట్‌-2012’ ప్రకారం సోషల్‌ మీడియాతో అనుసంధానమై ఉండేందుకు చాలా మంది స్మార్ట్‌ఫోన్స్‌, టాబ్లెట్లను వాడుతున్నారు. వాటికున్న అధిక కనెక్టివిటీ కారణంగా వినియోగదారుడు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా, ఎలా కావాలన్నా సోషల్‌ మీడియా వాడుకునే స్వేచ్ఛ లభించింది. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎం ఏఐ) నివేదిక ప్రకారం పట్టణ భారతంలో సోషల్‌ మీడియా వినియోగదారుల సంఖ్య 2012 డిసెంబర్‌ నాటికి 62 మిలియన్లకు చేరుకుంది. పట్టణ ప్రాంత భారతీయుల్లో విస్తృతంగా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు (74 శాతం) సోషల్‌ మీడియాను వాడుతున్నారు. ఇందులో ఎక్కువగా అంటే 97 శాతం మంది ఫేస్‌బుక్‌ వాడుతున్నారు. సగటున భారతీయులు రోజుకు 80 నిమిషాల చొప్పున సోషల్‌ మీడియా సైట్‌లను వాడుతుంటారు. ఇందులో ఎక్కువ మంది యువకులు (84 శాతం), కాలేజీ విద్యార్థులు (82 శాతం) ఉన్నారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియో గదారులను కలిపితే దేశంలో మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 80.2 మిలియన్లు.దేశ జనాభా లెక్కలు-2011 ప్రకారం యాబై శాతానికిపైగా జనాభా 25 ఏళ్లలోపు వారే. అలాగే 65 శాతానికి పైగా జనాభా 35 ఏళ్లలోపు వయస్సు గలవారు. 2020 నాటికి సగటు భారతీయుని వయస్సు 29 సంవత్సరాలు ఉండబోతు ందని అంచనా. జనాభా లెక్కల ప్రకారం 74 శాతం అక్షరాస్యులుం డగా పురుషుల్లో అక్షరాస్యతా 82 శాతం. చౌక మొబైల్‌ ఫోన్లు బాగా అందుబాటులోకి రావడంతో రానున్న కొద్ది సంవత్సరాల్లో భారతదే శంలో ఇంటర్నెట్‌ వినియోగం, అందులో సోషల్‌ మీడియా నెట్‌వ ర్కింగ్‌ గణనీయంగా పెరుగుతుందని చెప్పవచ్చు.ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఫ్లిక్కర్‌, యూ ట్యూట్‌, లింక్‌డ్‌ ఇన్‌, పింటరెస్ట్‌, వై స్పేస్‌, సౌండ్‌ క్లౌడ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లలో చర్చ, సృష్టి, సహకారం, పంచుకోవడం, లిఖిత సమాచారాన్ని మరింత మెరుగుపరచడం, ఆడియో, వీడియోలను పంచుకోవడం వంటి సామర్థ్యాలు ఉంటా యి. కళలు, వ్యాపారాలు, వాణిజ్య రంగాలను రూపుదిద్దడంలో, అ ణగారిన వర్గాలకు సాధికారత పంచడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించనుంది.కేంద్ర ప్రభుత్వంలోని చాలా విభాగాలు సోషల్‌ మీడియాను ఉపయోగిం చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. విదేశాంగశాఖ, ప్రణాళికా విభాగం, ప్రధాని కార్యాలయం సహా పలు మంత్రిత్వశాఖలు, సంస్థలు క్రమేణ సోషల్‌ మీడియా వేదికలను ఉపయోగించుకోవడం ఎక్కువవుతుంది. ఉదాహరణకు బడ్జెట్‌ను దేశప్రజలకు వివరించ డానికి ఆర్థికమంత్రి గూగుల్‌ హ్యాంగవుట్‌ను ఉపయోగించారు. జాతీయ స్థాయిలో ఇలా చేయడం ఇదే ప్రథమం. 12వ ప్రణాళికను ప్రజానీకానికి తెలియజేసి వారి స్పందనను రాబట్టడానికి ప్రణాళి కను దేశ ప్రజానీకానికి తెలియజేసి వారి స్పందనను రాబట్టడానికి ప్రణాళిక సంఘం సోషల్‌ మీడియాను ఉపయోగించి కొన్ని సృజనాత్మక చర్యలు తీసుకున్నది. ప్రభుత్వంలో సమాచారవ్యాప్తికి సంప్రదాయ, ప్రచార, ప్రసార సాధనాలను డబ్బు, వ్యవస్థల తాలూ కూ పద్ధతులు ప్రభావం చేస్తుండటంతో ప్రజల నిజాయితీ గొంతు కను అంతే స్వేచ్ఛగా వినిపించడానికి సోషల్‌మీడియా ఉపయో గపడబోతోంది. వాస్తవ రాజకీయ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అరబ్‌స్ప్రింగ్‌లాంటి ఒక్క ఉదాహరణ చాలు. ప్రభుత్వంతో ప్రజలు జరిపే లావాదేవీలకు, సేవల వంటి సమాచార ప్రజాస్వామీకరణకు సోషల్‌ మీడియా నిజమైన ప్రజావేదిక అవుతుంది.విద్య, బోధనరంగాల్లో కూడా గణనీయమైన ప్రగతి సాధనకు ఐసీటీ ఆధారిత మాధ్యమం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌లో సంభాషించుకునే ందుకు వ్యవస్థాపక వ్యయం చాలా తక్కువ. ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ వ్యక్తిగతంగానూ, ప్రత్యేకించి ఉద్యోగస్వామ్యంలో చిక్కుకున్న వారు వీటిని ఏర్పరచుకొని కలిసి పనిచేయవచ్చు. సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. సామాజిక మాధ్యమాన్ని విద్యలో విలీనం చేయడం వల్ల తప్పనిసరిగా నేర్చుకోవాలనే భావన నుంచి ఇష్టపడి నేర్చుకోవాలనే అభిప్రాయం కలుగుతుంది. విద్యారంగంలో అనేక లోపాలున్న తరుణంలో ఎంతో ప్రయోజన కారి అయిన సామాజిక మాధ్యమాన్ని విద్యలో విలీనం చేయవలసిన అవసరం ఉంది. రాజకీయ జీవితంలోకి కూడా సోషల్‌ మీడి యా చొచ్చుకుపోయింది. ఇందుకు సందేహం లేదు. సామాజిక కా ర్యాచరణ, రాజకీయ సమీకరణలు, ‘అరబ్‌స్ప్రింగ్‌’ వంటి ప్రజా ఉద్యమాల్లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమ వేదికల వినియోగం సర్వసాధారణంగా మారింది. గత ఏడాది కాలనికి పైగా పలువురు భారతీయులు ఫేస్‌బుక్‌ ద్వారా రాజకీయ అసమ్మతిని వ్యక్త పరచడం జరిగింది. రాజకీయాల్లో తలలు పండిన ఉద్దండులు సైతం సోషల్‌ మీడియా శక్తిని చూసి నివ్వెరబోతున్నారు. ట్విట్టర్‌పై తమ పార్టీ అధినాయకత్వం పట్ల ఆగ్రహం వెదజల్లిన అప్పటి కేంద్ర మంత్రి ఒకరు రాజకీయ తుపానులో చిక్కుకుని, కనుమరుగైన ఉదంతం ఇందుకు తార్కాణం. రాజకీయ చర్చలు, నిర్వహణ, నిరస నలకు వీలుగా పౌరులకు సోషల్‌ మీడియా కల్పిస్తున్న అవకాశాలు ప్రభుత్వాల కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయి. సిరియాలో 2012 నవంబర్‌లో ఇంటర్నెట్‌ మూసివేత, పాకిస్తాన్‌లో 2012 మధ్యకాలంలో యూ ట్యూబ్‌ నిలిపివేత లేదా ప్రస్తుత చైనాలో పౌర ఉద్యమాల సెన్సార్‌షిప్‌ తదితరాలు ఇందుకు సాక్షాలు. భారత్‌లో కూడా కంప్యూటర్‌ లేదా ఇతర సాధనాల ద్వారా ఇచ్చే కొన్ని రకాల సమాచారాన్ని సామాజిక సాంకేతిక చట్టం-2000లోని 66(ఏ) సెక్షన్‌ కింద శిక్షార్హమైనదిగా పరిగణిస్తారు.ఇవేగాకుండా బెంగళూర్‌లో చెలరేగిన ఘర్షణలు, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్లు, డిసెంబర్‌లో ఢిల్లీలో యువతి గ్యాంగ్‌ రేప్‌ నేపథ్యంలో అప్పటికప్పుడు వేలాదిమంది గుంపులు గుంపులుగా ప్రజలు ఇండియాగేట్‌ వద్దకు చేరిన ఘటనలు ఇందుకు అతీతం. అదేసమయంలో సోషల్‌ మీడియా చొరవతో కైరోలోని తహ్రీస్క్వైర్‌, ఢాకాలోని షాభాగ్‌లో జరిగిన ప్రజా ఉద్యమాల గురించి భారతీ యులందరికీ తెలియదని భావించనక్కర్లేదు. రెండంచుల కత్తి అనే సామెత మాదిరిగానే ఇంటర్నెట్‌ ఆధారిత సోషల్‌ మీడియాకు కూడా రెండు వైపులా పదనుంది. ఇది ఆర్థికాభివృద్ధిని పెంచడం, మానవా భివృద్ధికి దోహదం చేయడంతో పాటు రచనా చౌర్యానికి, కొత్త తరహా నేరాలు, అలవాట్లు, నైతిక విలువల పతనం, పుకార్లు, వాస్త వ జీవితం నుంచి దూరం చేయడం లాంటి పరిణామాలకు కూడా అవకాశాలు కల్పిస్తుంది. ఉదాహ రణకు అసోంలోని కోక్రాఝర్‌లో 2012 జులై 25న బోడో తెగ, బెంగాలీ ముస్లింలకు మధ్య జరిగిన జాతుల ఘర్షణ వ్యవహారంలో సోషల్‌ మీడియా అవాంఛనీయమైన పుకార్లు షికార్లు చేయడం, ఆగస్టు నెలలో షికార్లు చేసిన ఈ పుకార్లు మొబైల్‌ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి భారతదేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగళూర్‌, చెన్నై, పూణేలో నివసించే ఈశాన్య భారతీయులను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో వారంతా ముస్లిం మతతత్వవాదులు తమను లక్ష్యంగా చేసుకుంటారనే వార్తలతో భీతిల్లి, తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తడంతో మునుపెన్నడూ లేనిరీతిలో రైళ్లలో రద్దీ పెరిగింది. శివసేన నేత బాల్‌థాకరే మరణించిన రోజు ముంబయి నగరంలో బాంద్‌లాంటి వాతావరణం ఎందుకు నెలకొం దని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పాల్ఘాడ్‌ ప్రాంతానికి చెందిన షాహీ న్‌దాదా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఆ కామెంట్‌ను రీనూ శ్రీనివాసన్‌ లైక్‌ చేసింది. స్థానిక శివసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దానిని ఉపసం హరించుకున్నారు. యువతులను అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు అధికారులను బలి చేశారు. కార్టూనిస్టు అసీమ్‌త్రివేదిని 2012 సెప్టెంబర్‌లో దేశద్రోహం అభి యోగం కింద చేశారు. అతని కార్టూన్లు అధికారంలో ఉన్న వ్యక్తులను చికాకు పరిచాయి. గతేడాది ఏప్రిల్‌లో బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతాబెనర్జీపై వ్యంగ్య కార్టూన్‌ నెట్‌లో పెట్టిన జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ అంబికేశ్‌ మహాపాత్రను అరెస్టు చేశారు.
– రాధిక గట్టు,
హన్మకొండ.
(తరువాయి భాగం రేపటి సంచికలో..