స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న కారు: పలువురికి గాయాలు

పెద్దపల్లి,జూలై11(జ‌నం సాక్షి): సుల్తానాబాద్‌ మండలం గర్రపల్లిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మరో 14 మంది విద్యార్థులు స్పల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దుబ్బపల్లి దగ్గర స్కూల్‌ వ్యానును అతివేగంతో వచ్చిన కారు.. వెనక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వ్యాన్‌ పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ సహా 14 మంది విద్యార్థులు స్పల్పంగా గాయాపడ్డారు. తొమ్మిదేంళ్ల బాలుడు చంద్రహాసన్‌రెడ్డికి మాత్రం తలకు బలంగా గాయమవ్వడంతో తీవ్ర రక్తం స్రావం జరిగింది. దీంతో ఘటన చూసిన స్థానికులు కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.