స్కూల్ డ్రెస్ పంపిణీ చేసిన చైర్పర్సన్ పండిత్ వినిత పవన్
జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు 30: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మొన్న జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో మౌలిక సదుపాయాలపైన చర్చ జరిగింది.
అనంతరం ఆర్మూర్ మన్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్ ని కలవటం జరిగింది.
పాఠశాలలో నెలకొన్న ప్రధాన సమస్యలను తెలుపటం జరిగింది. సమస్యలపై తాను సానుకూలంగా స్పందించి వెంటనే పాఠశాలలోని టాయ్లెట్స్, నీటివసతి సదుపాయాలను సమకూర్చటం జరిగింది.
మంగళవారం రోజూ న పాఠశాలకు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్ మరియు సుంకరి సుజాత రమేష్ కౌన్సిలర్ విచ్చేసి పాఠశాలలో పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థినులకు దుస్తులను అందజేశారు.అలాగే పాఠశాలలోని నీటి కొరతపై స్పందించి నూతనంగా బోర్ వేయిస్తానని ఎల్లవేళలా పాఠశాల సమస్యలపై స్పందిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్మూరు మున్సిపల్ పండిత్ వినిత పవన్ మాట్లాడుతూ.
ఆర్మూర్ (బాలికల)పాఠశాలకు చాలా చరిత్ర ఉందని ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత పదవులు మంచి స్థానం లలో ఉన్నారని విద్యార్థినులు అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి ఎదగాలని, తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు ఇవ్వటం జరిగింది.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల పిజి హెచ్.ఏం పండిత్ వినిత పవన్ ని మరియు కౌన్సిలర్ సుజాత రమేష్ ను శాలువతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఏం సి చైర్మెన్ పొన్నాల చంద్రశేఖర్, వైస్ చైర్మెన్ సంతోష్, సభ్యులు నవాబ్ పాఠశాల ఉపాధ్యాయిని బృందం, విద్యార్థినీలు పాల్గోన్నారు.