స్పష్టత లేకుండా సభ వాయిదా వేస్తారా..?

C

– గన్‌పార్కు వద్ద విపక్షాల ఆందోళన

హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): రైతలు విషయంలో స్పష్టమైన హావిూ ఇవ్వకుండా ప్రబుత్వం బుల్‌డోజ్‌ చేయడాన్ని నిరసిస్తూ  తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం గన్‌పార్క్‌ వద్ద విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని వారు మండిపడ్డారు. రైతు రుణాలను ఏకపక్షంలో మాఫీ చేయాలంటూ  విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సభలో ఇదే అంశంపై గతరాత్రి, గురువారం ఉదయం కూడా డిమాండ్‌ చేశారు. అయినా సర్కార్‌ వినకుండా సభను వాయిదా వేసింది. తెలంగాణ శాసనసభను అర్థాంతరంగా వాయిదా వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు మూకుమ్మడిగా వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.  అసెంబ్లీ ఎదుట రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారు. డీసీపీ కమలహాసన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసి నాంపల్లి పీఎస్‌ కు తరలించారు.

శాసనసభను అర్థాంతరంగా వాయిదా వేయడంపై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు.  రైతు సమస్యలపై చర్చ సందర్బంగా ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. రుణమాఫీ విషయంలో స్పష్టమైన హావిూ ఇవ్వకుండా సభను వాయిదా వేయడం ఎంతవరకు సబబని కాం/-గరెస్‌ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డికె అరుణ, చిన్నారెడ్డి తదితరులు అన్నారు. రైతులకు అండడా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకుప్రకటన చేయలేదని, హావిూ ఇవ్వలేద్నారు. తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాయిదా వేయడం, బయట మాట్లాడితే అరెస్ట చేయడం ప్రభుత్వ నిరంకుశానికి నిదర్శనమన్నారు. వీరిని నాంపల్లి పోలస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడా వీరు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీపై స్పష్టత కోరితే పట్టించుకోలేదన్నారు. తాము స్పస్టమైన హావిూ ఇవ్వాలని అడిగితే సమాధానం ఇవ్వకుండా సభను వాయిదా వేయడం దారుణమన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పోరాటం కొనసాగిస్తామన్నారు.