స్వగ్రామంలోనే బి.వి అంత్యక్రియలుహజరైన చంద్రబాబు, ఎమ్మెల్యేలు

కర్నూలు, జూలై 28 : మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత బి.వి మోహన్‌రెడ్డి అంత్యక్రియలు. ఆయన స్వగ్రామమైన ఉలిందగుంటలో శనివారం సాయంత్రం 5గంటలకు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై, అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. అదే విధంగా డోన్‌ ఎమ్మెల్యేలు కె.ఇ కృష్ణమూర్తి, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఇ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు బి.వి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి ఆధినేత చంద్రబాబు మాట్లాడుతూ దివంగత బి.వి మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీలో కొనసాగారని అన్నారు. తన ఆరోగ్యాన్ని లెక్కచెయ్యకుండా ఇటీవల జరిగిన ఉప ఎన్నిక పోటిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై దీటైన పోటి ఇచ్చారని అన్నారు. క్రమశిక్షణ గల సైనికునిలా మోహన్‌రెడ్డి పార్టీకి ఎంతో కృషి చేసారని, అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఐదుమార్లు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవులు అందుకుని సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. శనివారం ఉదయం బి.వి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మధ్యాహ్నం 1గంట వరకు వుంచారు. అక్కడి నుండి పార్థివదేహాన్ని స్వగ్రామమైన ఉలిందగుంటకు తరలించారు. అక్కడే అంచక్రియలు జరిగాయి.