స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.
జాతీయ భావం పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ కార్యక్రమాలు నిర్వహణ పై సంబంధిత జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతంలో స్వాతంత్ర్య పోరాట ఫలితాలను మనమందరం అనుభవిస్తున్నాము అని,ఆ స్ఫూర్తిని, ఆ ప్రేరణను, జాతీయ భావాన్ని ఇప్పుడున్న తరాలకు కలిగించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, ఆగస్ట్ 8 నుండి 22 వరకు ప్రతిరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సమన్వయంతో చేసి విజయవంతం చేయాలనీ తెలిపారు.
జిల్లాకు అందిన జెండాలను ఇప్పటికే మండలాలకు, మునిసిపాలిటీ లకు పంపడం జరిగిందని, ఈ నెల 9 నుండి జెండా పంపిణీ మొదలవ్వాలి అని,గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ, మునిసిపాలిటీ ప్రాంతంలో వార్డ్ అధికారులచే పంపిణీ జరగాలనీ, జెండా పంపిణీ సమయంలో నిబంధనలు పాటించాలని, టీమ్ లను చేసి ఇంటింటికి తిరిగి జెండాలను అందజేయాలని, జెండాలు ఇచ్చినప్పుడు ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు తెలుపాలని, కాల్చడం, పారవేయడం చేయరాదని, వాహనాలపై కట్టకూడదని నిబంధనలు తెలపాలన్నారు. నిబంధనల విషయంలో,ఎగురవేసే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ టామ్ టామ్ చేయించాలని, జెండాలు ఎగురవేసిన సందర్భంలో ఫోటో, వీడియో లు తీసి పంపాలని తెలిపారు.
ప్రతి ఇంటిపైన జెండాను ఎగురవేసిన సందర్భంలో ఇతర జెండాల కంటే ఎత్తులో ఉండాలని, ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా కర్రను, పి.వి.సి. పైప్ కు జెండాను పెట్టాలని తెలిపారు. 13 నుండి 15 వరకు జెండాను ఇంటిపై ఎగురవేసే విధంగా చూడాలని తెలిపారు.
ఈ నెల 9 నుండి గాంధీ సినిమా ప్రదర్శన ఉదయం 10 గంటల నుండి 1-15 వరకు నిర్వహించ నునందున పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు ఉదయం టిఫిన్ చేసి వచ్చే విధంగా చూడాలని, బస్ లో ప్రతి 15 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని, అలాగే ఒక మండల స్థాయి అధికారి బస్ లో వుండాలని, ఉదయం 9 గంటలకు పాఠశాలలో పిల్లలను ఎక్కించుకొనే విధంగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని, ఆలస్యం చేసి బస్ స్పీడ్ తో పోకుండా, ముందుగానే బస్ ఉండే విధంగా చూసి నెమ్మదిగా వెళ్ళాలని తెలిపారు. లో లెవెల్ బ్రిడ్జి, కాజ్ వేలపై రోడ్డు మీద నీరు పారుతున్న సమయంలో దాటరాదు అని, లాంగర్ రూట్ అయిన సేఫ్టీ రూట్ లో వెళ్ళాలని, 9 నుండి 11 వరకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు, 16 నుండి ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు గాంధీ సినిమా ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
ప్రతి సినిమా టాకీస్ లో వైద్య బృందం టాకీస్ లోపల ఉండే విధంగా చూడాలని తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి వాడల,50 ఇళ్లకు ముగ్గురు,నలుగురు యువకులను ఎంపిక చేసి ఫ్లాగ్ కోడ్ నిబంధనలు పాటించే విధంగా ఎస్.హెచ్. ఓ.లు,తహసిల్దార్ లు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రతి గంటకు బస్ స్పీడ్ 40 నుండి 50 కిలో మీటర్ లోపలే ఉండాలని,దాటరాదు అని,పిల్లలను బస్ లోపల ఎక్కిచ్చే సమయంలో స్కూల్, టాకీస్ ఆవరణ లోపల ఉండే విధంగా చూడాలని, రోడ్డు మీద ఆపి ఎక్కించ కూడదని తెలిపారు. బస్ లో ఎక్కించుకున్న విధంగా క్రమ పద్ధతిలో అలాగే సినిమా హాలులో కూర్చొని బయటకు వచ్చే విధంగా చూడాలని తెలిపారు.
ఈ సందర్భంగా షెడ్యూల్ లో ఈ నెల 10 నుండి 21 వరకు చేయవలసిన కార్యక్రమాలు,పోలీస్, అధికారుల సమన్వయంతో ఈ నెల 11న ఫ్రీడమ్ రన్,13న ర్యాలీ,16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాల నిర్వహణ పై జిల్లా అధికారులు, తహశీల్దార్,ఎంపిడిఓ లు,ఎస్.హెచ్. ఓ లతో జిల్లా కలెక్టర్,ఎస్పీలు సమీక్షించి సలహాలు, సూచనలు చేశారు.
స్పోర్ట్స్ కమిటీ ని ఏర్పాటు చేసుకొని క్రీడా పోటీలు ఉద్యోగులు, యూత్ కొరకు పోటీలు నిర్వహించ నున్నట్లు, 18న బహుమతి ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.యూత్ కొరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో, ఉద్యోగులకు మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో 11నుండి 13 వరకు,మండల స్థాయిలో 14 నుండి 16 లోగా,జిల్లా స్థాయిలో 17నుండి 18 వరకు పూర్తి చేయాలని తెలిపారు. పి. ఈ.టి.లు, పి. డిలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ. సాయిబాబా, ఆర్డీవోలు, డి.వై.ఎస్. ఓ., డి.సి.హెచ్.ఎస్., డి.ఎం.హెచ్. ఓ. డాక్టర్ హరీష్ రాజ్, డి. డబ్ల్యూ. ఓ. నర్మద, డి.ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, జిల్లా ఇంటర్ మిడియెట్ అధికారి సత్యనారాయణ, జి.డి.సి. ప్రిన్సిపల్, డి.సి.ఎస్. ఓ., ఫైర్ అధికారి,డి.సి.ఓ., జిల్లా రవాణ అధికారి, ఎం.వి.ఐ.,జైల్ సూపరింటెండెంట్, డి.హెచ్.ఎస్. ఓ. సూర్య నారాయణ, పశు శంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.సుధాకర్,సంక్షేమ అధికారులు,కలెక్టరేట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.