స్వాతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
కరీంనగర్,ఆగస్ట్14(జనం సాక్షి): స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేసారు. మంత్రి ఈటెల రాజేందర్ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అలాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా కలెక్టర్ ఈమేరకు చేసిన సూచనలతో జాగ్రత్తలు తీసుకున్నారు. 15న పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకలకు సంబంధిత చర్యలు చేపట్టారు. వర్షాలు పడుతున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయాలని ఆదేశించారు. సీటింగ్ ఏర్పాట్లు సరిగ్గా వుండాలని మైదానాన్ని వేడుకలకు సిద్ధం చేయాలని పోలీస్ అధికారులకు వివరించారు. తాగునీటి వసతి కల్పించాలని కమిషనర్‌ను, మైకు ఏర్పాటు చేయాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్‌ను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను వేడుకల్లో ప్రదర్శించాలని సంక్షేమ శాఖల అధికారులను కోరారు. ఆయా శాఖల్లో మంజూరైన సంక్షేమ యూనిట్లను ఆర్థికమంత్రి ఈటెల చేతులవిూదుగా లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.