స్వాతంత్ర్యం అంటే ఒక్క రోజు చేసుకునే వేడుక కాదు

 

 

ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడేందుకు 225 ఏళ్ల క్రితం నుండి స్వాతంత్ర్య భావనలతో మన పూర్వీకులు, మహనీయులు చేసిన వెలకట్టలేని త్యాగాల మూలంగా, నాలుగు తరాలు 150 సంవత్సరాల సుధీర్ఘ పోరాటంతో 75 ఏళ్ల క్రితం 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం సిద్దించింది

స్వాతంత్ర్యం యొక్క విలువ, దానికోసం చేసిన త్యాగాలు ఈ తరానికి, భవిష్యత్ తరాలకు తెలియాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొక్కుబడిగా కాకుండా 15 రోజుల పాటు భిన్నమైన కార్యక్రమాల ద్వారా తెలియజెప్పాలని, పెద్ద ఎత్తున చర్చ జరగాలని వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు

ఈ నెల 8 నుండి 22వ తారీఖు వరకు కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారు

భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోసం ఉరికంబానికి సిద్దమయ్యాడు .. దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా దేశంలోని ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామం వైపు కదిలించారు

ఎవరు ఏ దారి ఎంచుకున్నా అందరి లక్ష్యం భారత స్వాతంత్ర్యం కోసమే

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎటువంటి పాత్రలేని వారు, బ్రిటీష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు నేడు ఈ దేశానికి ప్రభువులుగా ఉన్నారు

ఆ రోజు మన పెద్దలు స్వాతంత్ర్య కోసం పోరాడక పోయి ఉంటే మన పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలి

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని బృందం అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత రాజ్యాంగం రచించారు

ఆ రాజ్యాంగం ప్రకారమే దేశంలో పాలన, న్యాయ, శాసన వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి .. ఏది చేసినా భారత రాజ్యాంగానికి విఘాతం కలగకుండా ముందుకుసాగాలి

75 ఏళ్ల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎకో పార్క్ వరకు నిర్వహించిన ఫ్రీడం రన్ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు, అదనపు కలెక్టర్లు ఆశీష్ గారు, వేణుగోపాల్ గారు తదితరులు

అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి గారికి రాఖీలు కట్టిన బాలభవన్ విద్యార్థులు .. అందరికీ రక్షాభందన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గారు