స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలకలు, పెన్సిళ్లు అందజేసిన: రవి
బూర్గంపహాడ్ ఆగష్టు15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండలం సారపాక కోయగూడెంలో అంగన్వాడి పాఠశాల పిల్లలకు భారత 75 వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా సామాజిక న్యాయవేదిక అధ్యక్షులు కోడెబోయిన రవి చిన్న పిల్లలకు పలుకలు, బల్పాలు, పెన్సిల్స్, రబ్బర్లు అందజేసి, విద్యార్థులకు ఉత్సాహం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రతి చిన్నారి విద్యావంతులుగా ఈ దేశానికి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదగాలని రవి ఆకాంక్షించారు. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి బావి భారత పౌరుడుగా తీర్చిదిద్దే అవకాశం ఒక్క గురువులకే సాధ్యపడుతుందని, దేశ భవిష్యత్తు విద్యార్థులని, బావి భారత పౌరులుగా ప్రపంచంలోనే గొప్పవారుగా పేరు ప్రఖ్యాతలు వచ్చేలా గురువులు కృషి చేయాల నీ రవి కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ అనసూర్య, కొయ గూడెం గ్రామ సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, తాళ్ల గుమ్మూరు కార్యదర్శి మురళి, రామకృష్ణ, రమేష్, యాదగిరి, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.