హమాలీ &మిల్ వర్కర్స్ యూనియన్
3వ రాష్ట్రమహాసభలనుజయప్రదంచేయండి
–IFTU జిల్లా అధ్యక్షులు దుబాకుల ప్రసాదు
టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని తుమ్మల చెలక గిడ్డంగి హమాలీల మస్టర్ వద్ద
హమాలీ & మిల్స్ వర్క ర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మూ డవ మహాసభలు జయ ప్రదంచేయాలని శుక్రవారం గోడపోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు దుబాకుల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో 35 కోట్ల అసం ఘటిత శ్రమజీవులకు నేడు బ్రతుకు భద్రతలేదన్నారు. సామాజిక భద్రత లేదు ఉత్పత్తి పంపిణీ రంగా లలో పనిచేస్తున్న హమాలి అండ్ మిల్ వర్కర్స్ పనులు నిలి పివేస్తే ఎక్కడిసరుకులు అక్కడే ఉండిపోతాయని అన్నారు.
ప్రజల వద్దకు సరుకులు చేరకపోతే పరిస్థితులు తీవ్ర సంక్షోభంగా మారుతాయని అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే శ్రమజీవులకు సామాజిక భద్రత కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్1952 భవిష్యత్తు భద్రతపై ఉంది, 20 మంది పనిచేసే సంస్థలకు పీఎఫ్ అమలు చేయాలని కానీ వందలాది అమాలీ కార్మికులు పనిచేస్తున్న పిఎఫ్ అమలుచేయ డంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ఎం ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కార్మిక రాజ్య భీమా చట్టం 1948 లో ఈ భీమా చట్టం కార్మికులకు ధీమా ఇవ్వడంలేదు. కానీ కార్పొరేట్లకు మాత్రం పాలకులు ధీమా ఇస్తున్నారని అన్నారు.
నిసిగ్గుగా కార్పొరేట్ పన్ను మాఫీలు, బ్యాంకు రుణాల ఎగవేతలకు విచ్చలవిడిగా అవకాశాలు ఇస్తున్నారని, ఎనిమిది గంటల పని 12 గంటలుగా మార్చడం 44 కార్మిక చట్టాలను పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా సవరిస్తూ నాలుగు లేబర్ కోర్సును తీసుకురావడంలో కేంద్రం ముందు వరుసలో ఉందని, అనేక ప్రభుత్వ రంగాలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని , అసంఘటిత కార్మిక సామాజిక భద్రత చట్టం 2008 అనార్గనైజడ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ
యాక్టు పార్లమెంట్ ఆమోదించి 14 సంవ త్సరాలు గడుస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని అన్నారు. ఈచట్టంప్రకారం సంక్షేమబోర్డు ఏర్పాటు పై ఆనాడు ప్రణాళిక ప్ర కటించి తిరిగిచట్టాన్ని చాపచుట్టిఉట్టికెక్కిం చారని
ఈస్థితిలోపాలకుల కుంభకర్ణుడి నిద్రవదిలించ డానికి హమాలీ మీల్ వర్కర్స్ సంఘటితం కావాల్సినసమయం వచ్చిందని తెలియచేశారు.దీనికై సంఘటితంగా ఉద్యమించా లని ఐఎఫ్టియు అనుబంధసంస్థ అయిన హమాలీ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ మూడో మహాసభలు ఖమ్మంలో జరుగుతున్నాయని వీటిని జయప్రదంచేయా లని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగి ఐఎఫ్టియు నాయకులు సురేష్ ,మహేష్, బిచ్చు,నరేష్ ,భద్రం,ఆనందు, బుచ్చయ్య ,కోటేశ్వరరావు ,శ్రీరాములు ,కృష్ణకుమార్ ,గణేష్ , హమాలీలు పాల్గొన్నారు.