హరితహారంలో సింగరేణి ముందంజ

రామగుండం,జూన్‌6(జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ గత మూడేండ్లుగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాల్లో రెండు కోట్ల 71 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. నాఅలుగో విడతకు కూడా సిద్దం అవుతున్నట్లు వెల్లడించారు. సింగరేణి కంపెనీ పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అందరికీ ఆదర్శం కావాలని వెల్లడించారు. ఓవర్‌బర్డెన్‌ నుంచి ఇసుక తయారీ, డీజిల్‌ వినియోగం తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. డీజిల్‌ తగ్గించేందుకు చేపట్టిన చర్యలు ఆర్టీసీ వంటి సంస్థలు పాటిస్తే నష్టాలు తగ్గుతాయన్నారు. అలాగే నదుల నుంచి ఇసుకను సేకరించే బదులు ఓవర్‌ బర్డెన్‌ నుంచి ఇసుక తయారు చేసే విధానాన్ని సింగరేణిలో ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.