హరితహారం కోసం సిద్దమవుతున్న అటవీశాఖ

భారీగా మొక్కలు నాటేలా ప్రణాళిక

సంగారెడ్డి,జూన్‌23(జ‌నం సాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. జూలైలో పసెద్ద ఎత్తున చేపట్టేకార్యక్రమంలో మొక్కల పెంపకం నర్సీల్లో సాగుతోందన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు జిల్లాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అటవీ పర్యావరణ శాఖ ఆధికారులను ఆదేశించింది. హరితహారం కింద జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేదన్నారు. నాటిన మొక్కలను తప్పకుండా సంరక్షించాలన్నారు. కొత్తగా మొక్కలు నాటడంతో పాటు గతంలో నాటిన వాటిని నీటిని అందించేందుకు అలాగె మొక్క చుట్టూ ఫెన్సింగ్‌ చేసి సంరక్షంచే చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. వచ్చే హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను వాటరింగ్‌ చేయాలన్నారు. వర్షాభావ పరిస్తితుల నేపథ్యంలో మొక్కలను నీటిని సరఫరా చేయాలని నాటిన మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. ఆయా శాఖల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను గమనించాలన్నారు. చెరువుగట్లు, పొలంగట్లపైన టేకు యూకలిప్టస్‌ వంటి మొక్కలను నాటించాలని ఇందుకు రైతులను ప్రజలను చైతన్య పరచాలన్నారు. మొక్కలను నాటి వాటి సంరక్షణ భాద్యతలను నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా నాలుగో విడుత హరితహారం కార్యక్రమానికి సిద్దం కావాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. హరితహారం నాలుగో విడుత కార్యక్రమం ఏర్పాట్లు, అర్బన్‌ పార్కులు తదితర అంశాలపై ఆయన సవిూక్షించారు. జూలై మొదటి, రెండో వారంలో నాలుగో విడుత హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ కూడా సూచించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కేటాయించిన మొక్కల లక్ష్యానికి అనుగుణంగా వివిధ శాఖలకు లక్ష్యాలను, కలెక్టర్లు కేటాయించాలని సూచించారు. అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా హరితవనాలు, అటవీ ప్రాంతాల్లో 50 శాతం పండ్ల మొక్కలు నాటడానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాలకు కావాల్సిన పండ్ల మొక్కలు, ఈత మొక్కలకు సంబంధించి ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలందరిని చైతన్య పరిచి భాగస్వాములను చేయాలని సూచించారు. మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత, పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న మొక్కలు, నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, నీటి సౌలభ్యత, మొక్కల రక్షణకు ఫెన్సింగ్‌ తదితర అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌కు సూచించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అభివృద్ధి చేయడంలో భాగంగా ఆయా జిల్లాలలో గుర్తించిన అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల్లో పనులు జూలై రెండో వారం నుంచి ప్రారంభంకావాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో మూడు లొకేషన్లలో గురించిన అర్బన్‌ పార్కుల అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.