హరిత హారం మహాయజ్ఞం
– మొక్కలు పెంచితేనే మానవ జాతికి మనుగడ
– చిలుకూరు బాలజీ సన్నిధిలో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్
హైదారబాద్,జులై3(జనంసాక్షి): హరితహారం ప్రభు త్వ కార్యక్రమం కాదని, ఇది ప్రజల కార్యక్రమమని ముఖ్య మంత్రి కెసిఆర్ అన్నారు. చెట్లను కొడుతూ పోయి ఇప్పుడు ఎడారిగా మార్చుకోవడం వల్లనే వానలు పడడం లేదని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఒక మహాయజ్ఞమని సీఎం అన్నారు. రం గారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసం గించారు. చిలుకూరు బాలాజీకి పూజలు చేసి స్వామి ఆశీ స్సులతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిం చుకున్నా మని తెలిపారు. హరితహారం అంటే ఏదో కాదు మనిషికి నాలుగు మొక్కలు నాటి పెంచడమే అని తెలి పారు. తెలం గాణకు పచ్చని మొక్కల దండ అని అన్నారు. ఈ కార్య క్రమం సందర్భంగా ఇవాళ ఇంత పెద్ద సభ అవ సరం లేదని, కానీ అందరం అధికారులం, మంత్రులం ఒకచోట కలవచ్చని తాను ఒప్పుకున్నానని సీఎం చెప్పారు. నాడు హైదరాబాద్ చుట్టు పక్కల అద్బుతమైన అడవి ఉండేదని ఇవాళ కంటికి కనపడకుండా పోయిందన్నారు. ఆనాడు హైదరాబాద్‌కు వచ్చి పోయిన వాన్ని గండిపేట నీ ళ్లు పడ్డా యి అనే వాళ్లనేవారని అన్నారు. అంటే గండిపేటలోకి అనంతగిరి, వికారాబాద్ అడవుల నుంచి ఔషద మొక్కల నీళ్లు వెల్లేవని తెలిపారు. ఆ నీళ్లు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే వని అన్నారు. వికారాబాద్‌లో టీబీ ఆస్పత్రిని కూడా ఆనా డు నిజాం అందుకోసమే ఇక్కడ కట్టించారని వివరించారు. తెలంగాణకు ఆకుపచ్చ దండగా హరితహారం ఉండాల న్నారు.డబ్బు వుంటే సరిపోదు.. ఆరోగ్యమూ అత్యవసరమే నన్నారు. చెట్లు లేకుంటే మనుగడే లేదన్నారు. కోతులు పం టలను దెబ్బతీయడానికి, అవి ఊళ్లవిూద పడడానికి కేవ లం అడవులను నరకడమేనని అన్నారు. వానలు రావాల న్నా కోతులు వెళ్లాలన్నా చెట్లు పెంచాల్సిందేనన్నారు. చెట్లు ఉంటేనే వానలు వస్తాయన్నారు. హరితహారం అంటే ఏదో ప్రభుత్వ కార్యక్రమం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసుకునే కార్యక్రమం కాదని, ఇది ఒక ప్రజల కార్యక్రమమని సీఎం అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు. హరితహారం మనకు మనం చేసుకునే సేవ అని వివరించారు. ఆనాడు మనం అడవులను నరకడం వల్ల కోతులకు పండ్లు పలాలు దొ రకక ఇవాళ మన ఊళ్లవిూద పడి పంట పొలాలను నాశ నం చేస్తున్నాయని తెలిపారు. మళ్లీ కోతులు అడవులకు పో వాలని, అలా పనిచేసి హరితహారం పథకం ద్వారా చెట్లను పెంచాలని సూచించారు. ఈ సంవత్సరం అందరూ చెట్టు పెంచండి వచ్చే సంవత్సరం విూకు కోరిన చెట్లు కావాల్సిన చెట్లను అందిస్తామని
తెలిపారు. గ్రామానికి 40 వేల మొక్కలను నాటాలని కోరారు. హరితహారం అంటే ఏదో షేక్‌హ్యాండ్ ఇచ్చి దులుపుకోవడం కాదని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఎక్కడెక్కడ ఎలా జరిగిందీ వివరించాలని అన్నారు. పట్టుబడితే కానీ పని జరగదు, అలాగే మనం జట్టు కట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు. ఆనాడు తెలంగాణ రాదని ఎద్దేవా చేశారు. కానీ ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం అలాగే హరితహారాన్ని కూడా కలిసికట్టుగా విజయవంతం చేసుకుందామన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని కార్యక్రమాలను మనం చేపట్టి విజయపథంలో దూసుకు పోతున్నామని తెలిపారు. పచ్చదనం పెంచేతేనే హరితహారం సాధ్యమన్నారు. రైతులు పెద్ద ఎత్తున చెట్లను పెంచాలన్నారు. వారికి కావాల్సినంత కరెంట్ ఇస్తామని అన్నారు. ఇక కరెంట్ కోతలన్నవి ఉండవన్నారు. రెండేళ్ల తరవాత 24 గంటల కరెంట్ ఇస్తామని అన్నారు. బాలాజీ ఆలయానికి వచ్చే భక్తులకు మొక్కలు పెంచాలని ఆశీర్వాదం ఇవ్వాలని సిఎం పూజారులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన్న హరితహారం కార్యక్రమంలో భాగంగా చిలుకూరు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా బాలాజీని దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.