హవిూలీలకు కూలీ రేట్లను పెంచాలి: సిఐటీయు
కరీంనగర్,జూన్29(జనం సాక్షి ): జిల్లాలో ఐకేపి, కోఆపరేటివ్ సొసైటిల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోలులో హమాలీలుగా పనిచేస్తున్న వారికి కనీస కూలీరేట్లను పెంచాలని, లారీలకు తాడు కడితే అదనంగా పాత పద్దతిననే చెల్లింపులు చేయాలని కరీంనగర్ ఆల్ మండల్స్ హమాలీ యూనియన్ సంఘం కోరింది. హమాలీలకు కూలీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్లపై కనీసం పది రూపాయలు పెంచాలన్నారు. తహశీల్దార్ ఆద్వర్యం లో హమాలీలకు గుర్తింపు కార్డులు ఇప్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారికి 2వేలు పించన్ ఇవ్వాలని, కార్మికులందరికి ప్రభుత్వమే ఉచితంగా భీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పాత కరీంనగర్ జిల్లాలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. తాగునీటితో పాటు, ఫస్ట్ ఎయిడ్ కూడా అందుబాటులో లేవన్నారు. ఇంతకంటే దౌర్బాగ్యకరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నించారు.