హావిూలిచ్చి తుంగలో తొక్కారు

మంచిర్యాల సభ ఏర్పాట్లను పరిశీలించిన మహేశ్వర్‌ రెడ్డి
మంచిర్యాల,మే12(జ‌నం సాక్షి ):  తెరాస అధికారంలోకి వచ్చేందుకు అనేక హావిూలిచ్చారని, వచ్చాక వాటిని విస్మరించారని డీసీసీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి అరోపించారు. ఈనెల 13న మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌ బస్సుయాత్ర పర్యటిస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగసభ మైదానాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై వారితో చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పథకాలని పేరు మార్చి తెరాస కొనసాగిస్తుందన్నారు. ప్రజలకు తమ విధానాన్ని, అధికారంలో ఉన్నప్పుడు చేసిన, చేయబోయే అభివృద్ధిని తెలియజేసేందుకే ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ శ్రీపతి శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరి రమేష్‌, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కమలాకర్‌రావు, నాయకులు సుంకి సత్యం తదితరులు పాల్గొన్నారు.
——————–