హావిూలు అమలు చేయలేకపోతున్న మోడీ

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే విభజన అంశం
మండిపడ్డ మాజీమంజనంసాక్షిత్రి షబ్బీర్‌ అలీ
కామారెడ్డి,ఫిబ్రవరి11జనంసాక్షి): తెలంగాణలో పార్టీ కూలిపోతుందని తెలిసి కూడా ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్టాన్న్రి ఇచ్చిందని మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తించిన సోనియా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. తెలంగారన ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని అన్నారు. అయితే ప్రధాని కాంగ్రెస్‌ త్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడడం దారుణమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, యువకుల ఆత్మబలిదానాలను అడ్డుకోవ డానికే పార్టీ నష్టం కలిగిన ప్రత్యేక రాష్టాన్న్రి కాంగ్రెస్‌ ఇచ్చిందన్నారు. కానీ నేడు ప్రధానమంత్రి తెలంగాణ ఇవ్వడం తప్పైందనే రీతిలో రాజ్యసభలో మాట్లాడడం యావత్‌ తెలంగాణ ప్రజలను అవమాన పర్చినట్లే నని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయలేక.. అసమర్థతను కప్పిప్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రధాని వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన అమరుల పోరాట ఫలితంగానే పార్లమెంట్‌లో అన్ని పార్టీల ఆమోదం తీసుకుని సోనియా ముందుకు వెళ్లారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు పాసైన రోజు సుష్మాఆస్వరాజ్‌ కూడా ఉన్నారని అన్నారు. పార్లమెంట్‌లో అన్ని పార్టీల వారు మైకుల్లో మాట్లాడిన తర్వాతనే తెలంగాణ బిల్లులు ప్రవేశ పెడుతున్నారని మైకుల్లోనే చెప్పారని, ఎలాంటి మైకులు బంద్‌ లేవని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.