హిందూ,ముస్లీం ల ఐక్యత కు ప్రతీక పీర్ల పండగ

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / మొహరం పండగ సందర్భంగా మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో ముస్లిం మతస్థులు గ్రామములోని అన్ని వీధుల్లో పీర్ల సవారీలను ఊరేగింపు చేసారు.పీర్లను ఊరేగింపు చేస్తున్నప్పుడు గ్రామ ప్రజలు ఊదు,కుడుకలు, సైదాకు దండలు, కానుకలు సమర్పిస్తూ ,శుభ్రమైన నీటితో పీర్లను ఎత్తుకున్న వారి కాళ్ళను కడిగి వారి కోరికలు కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ముస్లీం పెద్దలు  మాట్లాడుతూ… వారు ఈ పండగ అనేది దైవ ప్రవక్త మహమ్మద్‌ మనవళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీర్లను ఊరేగిస్తారని, ఈ పండగ హిందూ ముస్లింలకు ప్రతీకగా చెప్పుకుంటారన్నారు.
ఈ కార్యక్రమం లో ఇమామ్ ,ఖాజా ,పాషా ,రహీం ,మెహబూబ్ పాషా ,షేక్ హుస్సేన్ బాబా, సుభాన్ ,మోను ,ఆసిఫ్ ,యాకూబ్ ఖాజా, అనిల్ , వేముల బిక్షపతి ,వెంకన్న , ఎనగందుల వెంకటనరసయ్య, మురళి,శ్రీరామ్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.