హుజూర్ నగర్ లో ఘనంగా మహిళా దినోత్సవాలు     

  – మహిళ సంబురాల సందర్భంగా  సన్మానాలు
హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): హుజూర్ నగర్ లో ఘనంగా మహిళా దినోత్సవాలను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిరజిత చేతుల మీదుగా మహిళలను సన్మానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి  మహిళ సంబురాల పిలుపు మేరకు మహిళ దినోత్సవ సందర్బంగా హుజూర్ నగర్ మునిసిపాలిటీ కార్యాలయ ఆవరణలో  మున్సిపాలిటీ సీనియర్ ఉద్యోగిని  వెంకట నర్సమ్మ ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిరజిత దంపతులు ఘనంగా సన్మానించారు. అలాగే  ఆశాకార్యకర్తలను, అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు సైదిరెడ్డి మాట్లాడుతూ మహిళల్ని మహిళ శక్తి ని మొట్టమొదటగా గుర్తించి మహిళ సేవలకు మహిన్నత స్థానం కల్పించింది కేవలం ముఖ్యమంత్రి కెసిఆరేనని తెలియజేశారు. గత ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులని బానిసలుగా పరిగణించి కనీసం వారిని వారి సేవలను గుర్తించిన పాపాన పోలేదు కాని, ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటిసారిగా మహిళల సేవలను గుర్తించి ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా జీతాలు పెంచి వారి సేవలను గుర్తించడం జరిగిందన్నారు.  మహిళా దినోత్సవ సందర్భంగా  మహిళ సంబురాలలో భాగంగా  మార్చి 8 వ తారీకున  హుజుర్నగర్ మండల కేంద్రం లోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ స్థాయిలో మహిళ దినోత్సవ సంబురాలు నిర్వహిస్తున్నట్టు తీయజేశారు. ఈ సందర్భంగా మహిళలకు ఘనంగా సన్మానాలు, ఆతిధ్యం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లిఅర్చన,
ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, హుజుర్నగర్ మహిళ కమిటీ అధ్యక్షురాలు దొంతగాని పద్మ, గూడెపు దీప, మహిళ కౌన్సిలర్ లు  తదితరులు పాల్గొన్నారు.