హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన మేయర్ సుధారాణి
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24(జనం సాక్షి)
వరంగల్ బల్దియా పరిధి 29 వ డివిజన్ రామన్న పేట లోగల డా.బాబు జగ్జీవన్ రామ్ మునిసిపల్ కమ్యూనిటీ హాల్ లో బుధవారం అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్( యు.ఎఫ్.డబ్ల్యు.సి.) ఎం.జీ.ఎం.ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాలానుగుణం గా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని,గృహాల ఆవరణలో నీరు నిల్వవుండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ పురపాలక శాఖ మాత్యులు కే.టి.ఆర్.ఆదేశం మేరకు ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం లో ఉచితం గా మందులు కూడా అందజేస్తారని,ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో డా. భరత్ కుమార్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డా. రాజేష్,స్థానికులు ఎండీ షఫీ, రుద్ర శ్రీనివాస్, శ్రీరాముల సురేష్, నక్క జ్యోతి, వాడిక నాగరాజు, శివపురం లోకేష్, గట్టు చందు, రాచర్ల జగన్, రాజు మెడికల్ సిబ్బంది, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.